: 'దివాలీ బొనాంజా మీవైపు వస్తోంది': ఆసక్తిని కలిగిస్తున్న జియోమీ ట్వీట్లు


ఇండియాలోని స్మార్ట్ ఫోన్ యూజర్లకు దీపావళి పండగ సందర్భంగా 'బంపర్ బొనాంజా'ను దగ్గర చేయనున్నట్టు జియోమీ వెల్లడించింది. అది ఏంటన్న విషయాన్ని ప్రకటించకుండానే, మైక్రో బ్లాగింగ్ సైట్ల ద్వారా "మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తేలా వస్తున్నాం. అది ఏంటో ఊహించండి" అంటూ జియోమీ ఇండియా టీజర్ విడుదల చేసింది. మూడు చిచ్చుబుడ్లు, నాలుగు రాకెట్లు, ఐదు భూచక్రాలను పోస్ట్ చేసింది. ఆపై రెండవ ట్వీట్ లో 'CCCXLV' అని పెట్టింది. రోమన్ భాషలో దీనర్థం కూడా '345' కావడంతో నవంబర్ 3 నుంచి 5 మధ్య ఈ ఆఫర్ ఏంటన్నది వెల్లడి కావచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా, వచ్చే మూడేళ్లలో ఇండియాలో స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో శాంసంగ్ ను అధిగమించాలన్న లక్ష్యంతో దూసుకెళ్తున్న ఈ చైనా సంస్థ ఈ-కామర్స్ మాధ్యమాల ద్వారా భారీ డిస్కౌంట్లు, ఉచిత వస్తువులు ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News