: భద్రాచలం ఆలయంలో ఆదివాసీల ధర్నా
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయం వద్ద ఆదివాసీలు ధర్నా చేపట్టారు. ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. వివరాల్లోకి వెళ్తే, రామాలయంలో ఈనాటి శబరిమాత ఉత్సవాలకు లంబాడీలను ఆహ్వానించారు. దీంతో, ఆదివాసీలు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. శబరిమాత ఆదివాసీ మహిళ అని, అందువల్ల ఈ వేడుకకు కేవలం ఆదివాసీలను మాత్రమే ఆహ్వానించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి లంబాడీలను పిలవటం దారుణం, క్షమించరాని నేరమంటూ వారు ఆందోళన చేపట్టారు.