: ప్రీతీ జింతా కలుసుకున్న ఆ 'ప్రత్యేక వ్యక్తి' ఇతనేనా?


"నేను నా జీవితంలో ఓ ప్రత్యేక వ్యక్తిని కలుసుకున్నాను..." బాలీవుడ్ నటి, ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ లెవెన్ పంజాబ్ సహ యజమాని ప్రీతీ జింతా కొద్ది రోజుల క్రితం మీడియాకు చెప్పిన మాట. ఆ సమయంలో సదరు ప్రత్యేక వ్యక్తి ఎవరన్నది మాత్రం ప్రీతి నోటి నుంచి బయటకు రాలేదు. తాజాగా, ముంబైలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఐదవ వన్డే ముగిసిన అనంతరం దక్షిణాఫ్రికా జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ డేవిడ్ మిల్లర్ తో కలసి ప్రీతీ ఓ రెస్టారెంటుకు వెళ్లి డిన్నర్ చేస్తూ కనిపించింది. మిల్లర్ తో కలసి ఫోటోలకు ఫోజులిచ్చింది కూడా. ఆపై అతని చెయ్యి పట్టుకుని చక్కా నడుస్తూ వెళ్లిపోయింది. 40 ఏళ్ల ఈ అందాల ముద్దుగుమ్మ గతంలో పంజాబ్ జట్టు సహ యజమాని నెస్ వాడియాతో దగ్గరగా మెలిగిన సంగతి తెలిసిందే. వాడియా తనను వేధించాడని 2014లో ఆరోపించిన ప్రీతీ, అతనికి దూరమైనట్టు ప్రకటించింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న ప్రీతీకి ఇప్పుడు మిల్లర్ రూపంలో 'సమ్ వన్ స్పెషల్' దొరికాడని వార్తలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News