: ప్రియుడి పరారీతో ఆగిన పెళ్లి


వివాహానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. బంధుమిత్రులంతా విచ్చేశారు. అంతటా పెళ్లి హడావుడి కనిపిస్తోంది. కాసేపట్లో పెళ్లి తంతు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతలో షాకింగ్ న్యూస్. పెళ్లికొడుకు జంప్ అనే వార్త అక్కడున్న అందర్నీ షేక్ చేసింది. చుట్టు పక్కల వెతికినా పెళ్లి కొడుకు కనిపించకపోవడంతో పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో, పెళ్లి కూతురు బంధువులు తమిళనాడులోని తిరువల్లూరు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతంలో గొప్ప ట్విస్ట్ ఏంటంటే... పెళ్లికొడుకు వివేక్, పెళ్లి కుమార్తె సంగీత ఇద్దరూ ఆల్రెడీ ప్రేమించుకున్నారు. అంతేకాదు గత ఆగస్టులో రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. దీంతో, ఇరువురి కుటుంబీకులు జోక్యం చేసుకుని, వీరి వివాహాన్ని సంప్రదాయబద్ధంగా చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే వివాహానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే, వివేక్ జంప్ కావడంతో పెళ్లి ఆగిపోయింది. పెళ్లికొడుకు ఎందుకు పారిపోయాడనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.

  • Loading...

More Telugu News