: ఇక భారత జైళ్లే సేఫ్, ఇంటర్ పోల్ అధీనంలో హ్యాపీగా చోటా రాజన్... నవ్వుతూ ఫోటో!


దాదాపు రెండు దశాబ్దాలుగా ఒకవైపు దావూద్ ఇబ్రహీం గ్యాంగు, మరోవైపు భారత పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతూ, 'పిల్లీ-ఎలుక' ఆటాడిన చోటా రాజన్, ఇకపై భారత్ లోని జైళ్లు మాత్రమే తనకు రక్షణగా ఉంటాయని భావిస్తున్నాడా? నిన్న ఇంటర్ పోల్ కు పట్టుబడ్డ రాజన్ ఏమాత్రమూ బాధపడటం లేదా? ఇంటర్ పోల్ అధికారితో ఆయన దిగిన ఫోటో చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఆ అధికారి పక్కనే నిలబడి నవ్వుతూ ఉన్న చోటా రాజన్ చిత్రం ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న తనను భారత్ కు అప్పగిస్తారని, జైల్లో హాయిగా ఉండవచ్చని రాజన్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, చోటా రాజన్, 2008లో మోహన్ కుమార్ పేరిట పాస్ పోర్టును తీసుకుని దాని సాయంతోనే పలు దేశాల్లో తిరుగుతూ, ఎప్పటికప్పుడు దావూద్ గ్యాంగు నుంచి తప్పించుకుని తిరిగినట్టు తెలుస్తోంది. మరో రెండు పాస్ పోర్టులు కూడా మారు పేర్లతో ఆయన వద్ద సిద్ధంగా ఉండేవని సమాచారం. ఆస్ట్రేలియా పోలీసులు ఇచ్చిన సమాచారంతో నిన్న చోటా రాజన్ ను ఇండోనేషియాలోని బాలీ విమానాశ్రయంలో అరెస్ట్ చేయగా, ఆయన్ను ఇండియాకు తీసుకువచ్చేందుకు సీబీఐ బృందం అక్కడికి బయలుదేరిన సంగతి తెలిసిందే. కాగా, దావూద్ నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు తనంతట తానే ఆయన లొంగిపోయినట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి.

  • Loading...

More Telugu News