: లంక అధికారుల అదుపులో మరికొంతమంది భారత మత్స్యకారులు
మరికొంతమంది భారత మత్స్యకారులను శ్రీలంక నేవి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంక సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించినందుకుగాను వారిని అరెస్టు చేసినట్టు నేవీ అధికారులు తెలిపారు. జాలర్లతో పాటు ఏడు బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న జాలర్లు తమిళనాడులోని రామేశ్వరంకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు. మరోవైపు ఇంతవరకు లంక అరెస్టు చేసిన భారత జాలర్లను విడుదల చేయాలని కొంతమంది దీక్షలు చేస్తున్నారు.