: కాపురానికి రాలేదని భార్య గొంతు కోసేశాడు


కాపురం చేయడానికి హైదరాబాద్ రాలేదన్న కోపంతో ఏకంగా భార్య గొంతునే కోసేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి పంచాయతీ పరిధిలోని మదనాపురం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, భాస్కర్-శైలజ దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ తరుణంలో ఆరు నెలల క్రితం హైదరాబాద్ వచ్చిన భాస్కర్ ఓ షాపులో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో, తనతో పాటు హైదరాబాద్ రావాలని భార్యను కోరగా... ఆమె నిరాకరించింది. ఇదే విషయమై ఇరువురికి పలుమార్లు గొడవ జరిగింది. గత ఆదివారం గ్రామంలో జరిగిన ఓ వివాహానికి హాజరైన భాస్కర్ మరోసారి తన భార్యను హైదరాబాద్ రావాల్సిందిగా కోరాడు. ఆమె ససేమిరా అంది. దీంతో, రాత్రి శైలజ నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడి చేసి, ఆమె గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన శైలజను హుటాహుటిన నల్గొండలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News