: షారుఖ్ ఖాన్ కు ఈడీ సమన్లు


బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి మరోమారు సమన్లు వచ్చాయి. ఐపీఎల్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ ను బాలీవుడ్ నటి జుహీ చావ్లా, ఆమె భర్త జయ్ మెహతాతో కలిసి షారుఖ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకు సంబంధించిన కొన్ని షేర్లను 2008లో షారుఖ్ ఖాన్ మారిషస్ కు చెందిన ఓ సంస్థకు విక్రయించాడు. ఈ వ్యవహారం ఫెమా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని నాడు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఈ ఏడాది మే నెలలోనే ఈడీ షారుఖ్ కు సమన్లు జారీ చేసింది. తాజాగా నిన్న మరోమారు ఈడీ షారుఖ్ కు సమన్లు జారీ చేసింది. అయితే తాను ముంబైలో లేనని షారుఖ్ ఈడీకి సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం ఇవ్వాలని కూడా అతడు ఈడీని కోరినట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News