: పుణ్యక్షేత్రంలో పాపాలు... పోలీసుల అదుపులో ఐదు జంటలు


భక్తితో దైవదర్శనానికి నిత్యమూ వందల మంది వచ్చే కీసరగుట్టలో అసాంఘిక కార్యకలాపాలు, వ్యభిచారం జరుగుతున్న సమాచారాన్ని అందుకున్న ప్రత్యేక పోలీసు దళం జరిపిన దాడుల్లో ఐదు జంటలు పట్టుబడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా కీసర గుట్టలోని హరిత గెస్ట్ హౌస్ లో పలువురు మకాం వేసి వ్యభిచారానికి పాల్పడుతున్నారన్న సమాచారంతో వారు దాడులు చేశారు. గెస్ట్ హౌస్ లోని ఐదు గదుల్లో ఐదు జంటలు పట్టుబడగా, వీరెవరూ దంపతులు కాదని గుర్తించారు. వీరిని కోర్టు ముందు హాజరు పరచనున్నామని పోలీసులు తెలిపారు. పుణ్యక్షేత్రాల్లో ఈ తరహా పాపపు పనులు జరగడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News