: ఆంక్షలన్నీ భద్రత కోసమే, అర్థం చేసుకోండి: అమరావతి ప్రజలకు డీజీపీ వినతి
పలువురు వీవీఐపీలు, ప్రముఖులు నిత్యమూ వచ్చి వెళ్లే ప్రాంతం కాబట్టే అమరావతి పరిధిలోను, ముఖ్యమంత్రి గెస్ట్ హౌస్ ప్రాంతంలోను వివిధ ఆంక్షల అమలు తప్పనిసరని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు స్పష్టం చేశారు. ప్రజలు, స్థానికంగా నివాసం ఉంటున్న వారు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. సీఎం గెస్ట్ హౌస్ మరమ్మతు పనులను పరిశీలించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంగళగిరిలోని ఫైరింగ్ రేంజ్ దెబ్బతినకుండా అభివృద్ధి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇక్కడ వాహనాల పార్కింగ్, పరిపాలనా భవంతులను నిర్మించనున్నట్టు తెలిపారు.