: ఢిల్లీలో బిజీ కానున్న తెలంగాణ సీఎం కేసీఆర్...రేపు కూడా హస్తినలోనే ఉంటారట!


దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరికాసేపట్లో బిజీబిజీగా మారనున్నారు. నీతి ఆయోగ్ కమిటీ సమావేశానికి హాజరుకానున్న ఆయన అంతకుముందే పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. నీతి ఆయోగ్ భేటీ ముగియగానే నేటి సాయంత్రం కమిటీ సభ్యులతో కలిసి ప్రధానిని కలవనున్న కేసీఆర్ కమిటీ నివేదికను మోదీకి అందించనున్నారు. అంతకుముందే ఆయన కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీలతో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేసీఆర్ కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, నేటి భేటీలు ముగిసిన తర్వాత రాత్రి అక్కడే బస చేయనున్న కేసీఆర్ రేపు కూడా తనదైన శైలిలో మంత్రాంగం నడపనున్నారు.

  • Loading...

More Telugu News