: ‘ఎర్ర’ స్మగ్లర్ పై యాసిడ్ దాడి... తిరుపతిలో వెలుగు చూసిన దారుణ హత్య


ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లకు అడ్డాగా మారిన చిత్తూరు జిల్లాలో నేటి ఉదయం దారుణ ఘటన వెలుగు చూసింది. ఎర్రచందనం అక్రమ రవాణాలో ఓ రేంజికి ఎదిగిన స్మగ్లర్ శ్రీనివాస్ పై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. తిరుపతిలోని సుబ్బారెడ్డి నగర్ లో నివాసముంటున్న శ్రీనివాస్ ఇంటిలోకి కొందరు దుండగులు ప్రవేశించి మెరుపు దాడి చేశారు. ఇంటిలోకి రావడంతోనే శ్రీనివాస్ పై దుండగులు యాసిడ్ దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్ క్షణాల్లోనే ప్రాణాలు విడిచాడు. ఎర్రచందనం అక్రమ రవాణాతో పాటు ఓ హత్య కేసులోనూ శ్రీనివాస్ నిందితుడిగా ఉన్నాడు. పాత కక్షల కారణంగానే శ్రీనివాస్ పై దాడి జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News