: ఛోటా రాజన్ అరెస్టులో కీలక పాత్ర పోషించిన కేంద్ర మంత్రి!


ఇండోనేసియాలో దాక్కున్న మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్టులో కేంద్ర మంత్రి కీలక పాత్ర పోషించారు. బ్లాక్ టికెట్లు అమ్ముకున్న దగ్గర్నుంచి మాఫియాడాన్ గా ఎదిగిన ఛోటా రాజన్ పై పలు కేసులున్నాయి. ఈ ముంబై మాఫియా డాన్ దేశం విడిచి పారిపోయినా, దేశంలోని నేర సామ్రాజ్యాన్ని మాత్రం తన కనుసన్నల్లో నడిపిస్తున్నాడు. భారత్ లోని సంపన్నులను బెదిరించడం, డబ్బులు పోగేసుకోవడం వారి కార్యకలాపాలు! ఛోటా రాజన్ కదలికలపై సమాచారం అందగానే మాజీ సైనికాధికారి, కేంద్ర మంత్రి వీకే సింగ్ ఇండోనేసియాలో వాలిపోయారు. మూడు రోజులుగా అక్కడే మకాం వేసిన వీకే సింగ్ ఆస్ట్రేలియా పోలీస్, ఇండోనేసియా పోలీస్, ఇంటర్ పోల్, సీబీఐలను సమన్వయం చేశారు. చోటా రాజన్ ఆస్ట్రేలియాలో బయల్దేరిన దగ్గర్నుంచి ఇండోనేసియాలోని బాలికి చేరే వరకు అతని ప్రతి కదలికపై నిఘా వేసిన వీకే సింగ్, అతనికి ఏమాత్రం అనుమానం రాకుండా, మూడో కంటికి తెలియకుండా ఛోటా రాజన్ ను పట్టేశారు. ఈ ఆపరేషన్ లో వీకే సింగ్ కీలకంగా వ్యవహరించారని ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News