: నాలుగు దేశాలను వణికించిన భూకంపం
హిందూకుష్ పర్వతాల్లో సంభవించిన భూకంపం తీవ్రత ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలుస్తోంది. తొలుత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, భారత్ లను వణికించిన భూకంపం తరువాత నేపాల్ ను కూడా భయపెట్టింది. 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం పాకిస్థాన్, భారత్ లో 7.5, నేపాల్ లో 4.8 తీవ్రతను నమోదు చేసింది. పెను తీవ్రతతో పర్వతాల లోతుల్లో సంభవించిన భూకంపం ఆఫ్ఘన్, పాక్ సరిహద్దుల్లో పెను ప్రభావం చూపింది. భూకంప నష్టం అంచనా వేసేందుకు మరింత సమయం పడతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలు, కొండలు, కోనలు కదిలిపోవడంతో అసలు నష్టం ఎంత? అనేది అప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.