: చంద్రబాబుతో రేవంత్ రెండుగంటల భేటీ!


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో ఆ పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రెండు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో వరంగల్ ఎంపీ అభ్యర్థి, ఎర్రబెల్లితో వివాదంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ఎవర్ని నిలబెట్టే అవకాశం ఉంది? ఎవర్ని నిలబెడితే విజయావకాశాలు ఉంటాయి? రెండు పార్టీలకు వరంగల్ లో ఉన్న పట్టు ఎంత? పోలింగ్ సరళి ఎలా ఉంటుంది? వంటి అంశాలను వీరు చర్చించినట్టు సమాచారం. అలాగే ఎర్రబెల్లి తొలగించిన ఉద్యోగి విషయంలో రేగిన వివాదంపై కూడా పార్టీ అధినేతకు రేవంత్ వివరించినట్టు తెలుస్తోంది. కాగా, వరంగల్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News