: భూకంప అనుభవం చవిచూసిన బాలీవుడ్ నటులు
హిందూకుష్ పర్వతాల్లో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం బాలీవుడ్ సెలెబ్రిటీలను కూడా తాకింది. భూకంపం అనుభవాలను సోషల్ మీడియా ద్వారా బాలీవుడ్ నటులు తెలిపారు. 'అహ్మదాబాద్ లో హోటల్ రూంలో ఉండగా భూకంపం వచ్చిందని, తానున్న భవనం మొత్తం ఊగిపోయిందని' 'రక్త చరిత్ర' ఫేమ్ వివేక్ ఒబెరాయ్ తెలిపాడు. 'ఓ మై గాడ్! భూకంపం వచ్చింది' అంటూ ప్రీతి జింటా ట్వీట్ చేసింది. 'భూకంపం గురించిన వార్తలు వస్తున్నాయి. మీరు, మీ ఆప్తులు అంతా క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా' అని నేహా ధూపియా పేర్కొంది. 'భూపంకం వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నా' అని గాయకుడు అద్నాన్ సమీ పోస్ట్ పెట్టాడు. 'నాకు అనుభవంలోకి వచ్చిన అత్యంత తీవ్రమైన భూకంపం ఇది' అని అలీ జాఫర్ అన్నాడు.