: భూకంపం ధాటికి ‘పాక్’లో 52 మంది మృతి
భూకంపం ధాటికి పాకిస్థాన్ లో సుమారు 52 మంది మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్- పాకిస్థాన్ సరిహద్దులోని పాకిస్థాన్ లో భవనాలు, ఇళ్ల పైకప్పులు కూలి పడడంతో ప్రాణాలు కోల్పోయారు. స్వాత్ ప్రాంతంలో చిన్నారులు సహా ఆరుగురు, బజౌర్ గిరిజన ప్రాంతంలో నలుగురు మృతి చెందారు. పెషావర్ లోని లేడీ రీడీంగ్ ఆసుపత్రిలో సుమారు వందమంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఇస్లామాబాద్, పెషావర్, కరాచీ, రావల్పిండి, లాహోర్ తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. హిందూకుష్ పర్వత శ్రేణుల్లో ఈరోజు సంభవించిన భూకంప ప్రభావం పాక్, భారతదేశాలపై పడింది.