: భూకంపం తొక్కిసలాటలో 12 మంది విద్యార్థినులు మృతి
ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భారీ భూకంపం కారణంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 12 మంది విద్యార్థినులు మృతి చెందారు. భూ ప్రకంపనల నేపథ్యంలో టక్ హర్ ప్రావిన్స్ తలుకాన్ నగరంలోని పాఠశాల విద్యార్థులు బయటకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో మైనర్ విద్యార్థినులు ప్రాణాలు కోల్పోగా, 35 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దులోని హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో ఈరోజు మధ్యాహ్నం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.