: సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయి... భయపడకండి!: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
సహాయక బృందాలు సంసిద్ధంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లో ఈరోజు మధ్యాహ్నం భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం వలన మన దేశంలోని ఉత్తర భారత రాష్ట్రాల్లో ప్రకంపనలు సంభవించాయి. మన దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.