: మహిళాకర్షణ దిశగా డీఎంకే: కదంతొక్కనున్న కనిమొళి


డీఎంకే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఆ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కనిమొళి సిద్ధమయ్యారు. పార్టీ దళపతి, కోశాధికారి అయిన ఎంకే స్టాలిన్ ‘మనకు...మనమే’ నినాదంతో ప్రజల్లోకి వెళుతున్న విషయం తెలిసిందే. స్టాలిన్ చేపట్టిన ఈ పర్యటనకు విశేష స్పందన వస్తోంది. అన్న బాటలోనే కనిమొళి కూడా నడవనున్నారు. మహిళా విభాగం ద్వారా మహిళలను తమ పార్టీ వైపు ఆకర్షించేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని సిద్ధం చేశారు. జిల్లాల వారీగా ప్రత్యేక కమిటీలను ప్రకటించారు. జిల్లాలు, మహానగరం, నగర, యూనియన్ ల వారీగా కార్యక్రమాలను మరింతగా నిర్వహించనున్నారు. మద్య నిషేధం అమలు నినాదం, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, మహిళలపై జరుగుతున్న దాడులను ఎత్తి చూపుతూ కనిమొళి ఆధ్వర్యంలో నియమించిన ఈ కమిటీలు ప్రచారం చేపట్టనున్నాయి. చెన్నై జిల్లాలో కనిమొళి, దిండుగల్, కరూర్ జిల్లాల్లో మహిళా నేత నూర్జహాన్, ఇతర జిల్లాల్లో మహిళా విభాగాల్లో కీలక భూమిక నిర్వహిస్తున్న ఆయా ప్రాంతాలకు చెందిన నేతలు ఉన్నారు.

  • Loading...

More Telugu News