: భూకంపం వార్తలు వింటుంటే దిగ్భ్రాంతి కలుగుతోంది... ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలి: మోదీ


ఈ మధ్యాహ్నం భారత ఉపఖండాన్ని వణికించిన భూకంపం గురించి ఒక్కొక్కటిగా వస్తున్న వార్తలు తనకు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని భగవంతుడిని తాను ప్రార్థిస్తున్నట్టు మోదీ ట్వీట్ చేశారు. భూకంపం వచ్చిన ఆప్గనిస్థాన్, పాకిస్థాన్ దేశాలకు అవసరమైన ఎటువంటి సాయం చేయాలన్నా ఇండియా సిద్ధంగా ఉంటుందని అన్నారు. కాగా, పాక్, ఆఫ్గన్ మీడియా కథనాల ప్రకారం వందలాది ఇళ్లు కూలాయి. వేలాది ఇళ్ల గోడలు పడిపోయాయి. పాకిస్థాన్ లో పలు నగరాల ప్రజలు వీధుల్లోకి వచ్చి ఖురాన్ పఠిస్తూ కూర్చుండిపోయారు. పాకిస్థాన్ లో మరణించిన వారి సంఖ్య 20కి పెరిగినట్టు తెలుస్తోంది. ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతోంది.

  • Loading...

More Telugu News