: ఐపీఎల్ లో నేటి సందడి
ఐపీఎల్ ఆరవ సీజన్ క్రికెట్ అభిమానులకు వందశాతం వినోదాన్ని పంచుతోంది. నిన్న అయితే అభిమానులకు పండగే. బెంగళూరు జట్టు ఆటగాడు క్రిస్ గేల్ చెలరేగి చేసిన రికార్డు పరుగులు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అతి తక్కువ బంతుల్లో 175 పరుగులు చేసి రికార్డు నెలకొల్పిన గేల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఈరోజు విషయానికొస్తే ... 'కోల్ కతా నైట్ రైడర్స్-ముంబయి ఇండియన్స్' జట్లు తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ కోల్ కతా వేదికగా జరగనుంది. నిన్న రాత్రి 'ఢిల్లీ డేర్ డెవిల్స్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్' మధ్య జరిగిన పోరులో డెవిల్స్ జట్టు డీలా పడింది. 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసిన పంజాబ్ విజయం సాధించింది.