: భూకంపం పెద్దదే... ప్రాణనష్టం కూడా!


ఈ మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో హిందుకుష్ పర్వత ప్రాంతాలు కేంద్రంగా సంభవించిన భూకంపం తీవ్రత ఎక్కువగానే ఉంది. కాబూల్ సహా, పాకిస్థాన్ లోని పలు నగరాల నుంచి వస్తున్న వార్తల ప్రకారం, ఇప్పటివరకూ 11 మంది చనిపోయారు. ఆఫ్గన్ లో నష్టం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో, చాలా భవనాలు నాని ఉన్నాయని, ముఖ్యంగా మట్టితో నిర్మించుకున్న ఇళ్లు కూలిపోయాయని తెలుస్తోంది. ఆఫ్గనిస్థాన్ లోని జార్మ్ ప్రాంతానికి 28 మైళ్ల దూరంలో పర్వతాల నడుమ భూకంప కేంద్రం నమోదైందని అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్ లోని లాహోర్, పెషావర్ లతో పాటు ఖైబర్ ఫక్తుంక్వా ప్రాంతాల్లో ప్రజలు భూకంపానికి భయపడిపోయారని లాహోర్ లో ఉన్న ఎన్బీసీ న్యూస్ ప్రొడ్యూసర్ వజాహత్ ఎస్ ఖాన్ తెలిపారు. తాను లంచ్ చేస్తున్న సమయంలో భూకంపం వచ్చిందని, తన భోజనం టేబుల్ ఆటూ ఇటూ ఊగిందని ఆయన తెలిపారు. భూకంపం సృష్టించిన నష్టం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News