: వారు నా వారు కాదు: గీత వ్యవహారంలో కొత్త ట్విస్ట్
తన తల్లిదండ్రులను కలుసుకోవాలన్న కోరికతో ఈ ఉదయం ఇండియాకు వచ్చిన గీత, బీహార్ నుంచి వచ్చిన జనార్దన్ మహతో తన తండ్రి కాదని చెప్పింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ మధ్యాహ్నం వెల్లడించారు. గీత తనవారిని గుర్తు పట్టలేకపోయిందని ఆమె తెలిపారు. బీహారుకు చెందిన మహతో కుటుంబంతో తనకు సంబంధం లేదని గీత చెప్పిందని, గీత చిన్నప్పటి చిత్రాలుగా వారు చూపిన ఫోటోలు తనవి కావని స్పష్టం చేసిందని సుష్మా వెల్లడించారు. దీంతో గీత వ్యవహారం కొత్త ట్విస్ట్ తిరిగినట్లయింది. మరి, ఈ కథ ఎక్కడికి వెళుతుందో..!