: కోటికి చేరిన అనుష్క ఫేస్ బుక్ అభిమానుల సంఖ్య!
'రుద్రమదేవి' సినిమా ద్వారా విజయం అందుకున్న అనుష్క శెట్టి మరో ఘనతను సొంతం చేసుకుంది. సామాజిక మాధ్యమంలో అభిమానుల సంఖ్యను గణనీయంగా పెంచుకుని సహచర నటీమణులకు అందనంత ఎత్తుకు చేరింది. ఆమె ఫేస్ బుక్ లో కోటి మంది అభిమానులు చేరారు. దీంతో తన ఫేస్ బుక్ అడ్మిన్ అయిన హేమచందర్ కు ఆమె ధన్యవాదాలు తెలిపింది. అలాగే తనపై ఇంత అభిమానం చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు చెప్పింది. కాగా, అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన 'సైజ్ జీరో' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.