: 20 రోజుల క్రితం అనుచరులు, ఇప్పుడు బాస్!
సరిగ్గా 20 రోజుల క్రితం పాన్వెల్ కేంద్రంగా నిర్మాణ రంగంలో వ్యాపారం చేస్తున్న ఓ బిల్డర్ నుంచి రూ. 26 కోట్లను దోపిడీ చేసిన కేసులో చోటా రాజన్ ప్రధాన అనుచరులు సురేష్ షిండే (41), అశోక్ నికమ్ (29), సుమిత్ మాత్రే (28)లను ముంబై డీసీపీ (క్రైమ్) సురేష్ మాంగ్డే వలపన్ని పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులని, ప్రధాన నిందితుడు చోటా రాజన్ సహా మరో ఇద్దరు తప్పించుకున్నారని, వీరిపై మోకా చట్టం కింద కేసు నమోదు చేస్తున్నామని ప్రకటించారు. ఆపై పట్టుబడ్డ నిందితులను తమదైన శైలిలో విచారించగా, రాజన్ ఎక్కడకు వెళ్లాడన్న విషయమై పోలీసులకు ఉప్పందినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇంటర్ పోల్ సాయంతో చేపట్టిన ఆపరేషన్ విజయవంతం కాగా, చోటా రాజన్ బాలీలో ఈ మధ్యాహ్నం పట్టుబడ్డాడు.