: జంగిల్ రాజ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సరికావు: మంత్రులు ప్రత్తిపాటి, నారాయణ


ఏపీ సీఎం చంద్రబాబును 'జంగిల్ రాజ్' అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ ఖండించారు. వైసీపీ నేతలే చెరకు తోటకు నిప్పు పెట్టారని, ఈ అంశం విచారణలో ఉందని అన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి రాని జగన్ పరామర్శల పేరిట ఎందుకు రాజధాని ప్రాంతాలకు వచ్చారోనని ఎద్దేవా చేశారు. లంకభూముల సమస్యలపై రాజధాని ప్రాంత రైతుల కమిటీ విజయవాడలో సీఎంను ఈ రోజు కలిసిందని చెప్పారు. సమస్యలపై ప్రత్యేక కమిటీ వేయాలని సీఎం సూచించినట్టు మంత్రులు మీడియాకు వివరించారు.

  • Loading...

More Telugu News