: కానిస్టేబుల్ ను నడిరోడ్డు మీద నరికి చంపేశారు
నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ కానిస్టేబుల్ ను అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని గజ్వేల్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, నర్సింహులు అనే వ్యక్తి హైదరాబాదులోని బేగంపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓ పని నిమిత్తం ఈ రోజు ఆయన గజ్వేల్ కు వెళ్లాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి, నరికి చంపారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, ఈ హత్య వెనుక అతని భార్య హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నర్సింహులుపై అతని భార్య హెచ్చార్సీలో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.