: ఉత్తర భారతాన్ని వణికించిన పెను భూకంపం
హిందూ కుష్ పర్వతాలు కేంద్రంగా పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.5గా నమోదైంది. భూకంపం ధాటికి ఉత్తరాది రాష్ట్రాలు నిమిషం పాటు కంపించిపోయాయి. భూకంప తీవ్రతకు భవనాలు వణికిపోయాయి. దీంతో ఢిల్లీ సహా ఉత్తరాదిన ఉన్న పలు పట్టణాల్లో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భారీ భూకంపం రావడంతో పెను నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. భూకంప తీవ్రతకు ఢిల్లీలోని మండీ మెట్రోరైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులు పరుగులు తీశారు. భూకంప తీవ్రత పాకిస్థాన్ పై కూడా తీవ్ర ప్రభావం చూపింది. గత ఏప్రిల్ 25న నేపాల్ లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి నేపాల్ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. తాజాగా 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ఎంత నష్టం కలిగించిందో అని అంతా ఆందోళన చెందుతున్నారు.