: ఎర్రబెల్లి, ఎల్.రమణకు ఎస్కార్ట్ కుదించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ టీడీపీ అధినేత ఎల్.రమణ, ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఎస్కార్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. ఎన్నికల నేపథ్యంలో ఎర్రబెల్లి ఎస్కార్ట్ ను కుదిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తనకు భద్రతను తగ్గించడం పట్ల ఎర్రబెల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిపై ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ, సెక్యూరిటీ తగ్గించడం బాధాకరమన్నారు. ఎవరిని సంతోషపెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. ఎర్రబెల్లి, రేవంత్ మధ్య విభేదాలు లేవన్నారు. వారిద్దరూ పరిణతి చెందిన నాయకులని పేర్కొన్నారు.