: ధనవంతుడైన ఓ అరబ్ షేక్ నన్ను కొంటానని వచ్చాడు: 'ది బేస్ లైన్' హీరోయిన్ అట్కిన్సన్


దుబాయ్ నుంచి వచ్చిన ఓ ధనికుడైన అరబ్ షేక్, భారీ ఆఫర్ తో తన వద్దకు వచ్చి, భార్యగా తనతో రావాలని అడిగాడని హాలీవుడ్ నటి, 'ది బేస్ లైన్' ఫేమ్ జెమ్మా అట్కిన్సన్ తెలిపింది. తనతో పాటు దుబాయ్ వచ్చి భార్యగా ఉంటే, కావాల్సినంత ధనమిస్తానని అతను తన మేనేజ్ మెంట్ టీమ్ వద్దకు వచ్చాడని, ఆ ప్రపోజల్ విని తాను షాక్ తిన్నానని తెలిపింది. ఆ మనిషిని తానెక్కడా చూడలేదని, గతంలో ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచిన ఈ ముప్పై ఏళ్ల అందాల భామ తెలిపినట్టు 'మిర్రర్ డాట్ కో డాట్ యూకే' కథనాన్ని ప్రచురించింది. అతని ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాలని తన మేనేజర్ కు చెప్పినట్టు అట్కిన్సన్ వివరించింది.

  • Loading...

More Telugu News