: ఇక ‘అమ్మ’ కందిపప్పు!...తమిళనాట నవంబర్ 1 నుంచి కిలో రూ.110కే అందిస్తారట


తమిళ నాట అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సంక్షేమ పథకాలతో యమ స్పీడుగా దూసుకెళుతున్నారు. ఇప్పటికే ‘అమ్మ’ పేరిట పలు సంక్షేమ పథకాలకు తెర లేపిన జయలలిత, తాజాగా కందిపప్పును కూడా సబ్సిడీ రేటు కింద సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కందిపప్పు ధర డబుల్ సెంచరీ (రూ.200) దాటిపోయింది. ఈ నేపథ్యంలో కందిపప్పు కొనాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కందిపప్పును సబ్సిడీ రేటు కింద పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. కిలో కందిపప్పును రూ.110కి అందజేయాలని ఇప్పటికే జయలలిత అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక నవంబరు 1 నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని కూడా ఉత్తర్వులు జారీ చేశారట. దీంతో నిర్దేశిత సమయానికే పథకాన్ని ప్రారంభించేందుకు తమిళ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News