: మంత్రి తలసాని సమక్షంలోనే టీఆర్ఎస్ నేతల బాహాబాహీ


టీఆర్ఎస్ నాయకురాలు విజయారెడ్డి, ఆ పార్టీ మరో నేత మన్నె గోవర్ధన్ రెడ్డి వర్గాలు మరోసారి బహిరంగంగా ఘర్షణ పడ్డాయి. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ బీటీ రోడ్డు ప్రారంభోత్సవానికి ఇవాళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చారు. ఆయన ఎదురుగానే ఆ ఇద్దరు నేతల వర్గాలు ఒక్కసారిగా గొడవకు దిగాయి. తోపులాట కూడా జరిగింది. పోలీసులు కలుగజేసుకుని ఎంత నచ్చజెప్పినా రెండు వర్గాలు వినలేదు. దీంతో అక్కడే ఉండి ఇదంతా గమనిస్తున్న మంత్రి తలసాని అసహనం వ్యక్తం చేసి ఇరు వర్గాలను హెచ్చరించి వెళ్లిపోయారు. దాంతో గొడవ కొంత సర్దుమణిగింది. అయితే విజయారెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి వర్గాలు గతంలో కూడా ఇలాగే బాహాబాహీకి దిగాయి.

  • Loading...

More Telugu News