: కుమార్తె పెయింటింగ్ ప్రదర్శనకు అమీర్ ఖాన్ ప్రోత్సాహం
షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా పిల్లల విషయంలో సినీ నటులు ఎంతో శ్రద్ధ చూపుతుంటారు. వారిలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఒకరు. తాజాగా తన కుమార్తె ఇరాఖాన్ వేసిన పెయింటింగ్స్ తో మొదటిసారి ముంబైలో నిర్వహించిన ప్రదర్శనకు హాజరైన అమీర్ ఆమెను ప్రోత్సహించాడు. ఈ ప్రదర్శనను తిలకించిన అమీర్ కు అక్కడి బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న 'టైగర్స్ నెస్ట్' పెయింటింగ్ బాగా నచ్చింది. వెంటనే దాన్ని కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని అమీర్ స్వయంగా ట్విట్టర్ లో తెలిపాడు. ఆ పెయింటింగ్ తనను ఎంతగానో ఆకట్టుకుందని, అందుకే కొన్నానని తెలిపాడు. అమీర్, మొదటి భార్య రీనాదత్తాల కూతురే ఇరా అన్న విషయం తెలిసిందే.