: సీన్ రివర్స్... ఏలూరు కోర్టు ఆవరణలో భార్యా బాధితుడి ఆత్మహత్యాయత్నం


ఇప్పటిదాకా భర్త వేధింపులు తాళలేక భార్యలు ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను చూశాం. అయితే, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని కోర్టు ఆవరణలో ఇందుకు పూర్తి భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. భార్య, అత్త వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వేధింపుల పేరిట నమోదైన కేసు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన ఓ యువకుడు కోర్టు ఆవరణలోనే పురుగుల మందు తాగేశాడు. భార్య, అత్త వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతడు సూసైడ్ నోట్ కూడా రాశాడు. పురుగుల మందు తాగిన యువకుడిని పోలీసులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News