: మోదీ, అమిత్ షా రాజీనామా చేసే సమయం వచ్చేసింది: లాలూ


బీహారులో ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రాజీనామా చేసి ఇంటికెళ్లే పరిస్థితి రానుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. రోజుకు 8 నుంచి 9 గంటల పాటు బీహార్ లో ప్రచారం చేస్తూ, తనదైన శైలిలో ముందుకు దూసుకెళుతున్న ఆయన ఎన్నికల్లో తమ కూటమే గెలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్జేడీ తరఫున పూర్తి ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకుని పరుగులు పెడుతున్న ఆయన, కొద్దిగా అలసినట్టు కనిపిస్తున్నప్పటికీ, ఉత్సాహంగానే ప్రచారం చేస్తున్నారు. నేడు తన కుమారులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో రోడ్ షోలను నిర్వహించనున్న ఆయన, తమ సభలకు ప్రజలు పిలవకుండానే వస్తున్నారని అన్నారు. ఢిల్లీలో కూర్చున్న వారు తన ర్యాలీలకు ఎంతమంది వస్తున్నారో టీవీలు చూసి తెలుసుకోవాలని సలహా ఇచ్చారు. ఎన్నికల్లో విజయం తమదేనన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News