: కాంగ్రెస్ హయాంలో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టులో తిరుపతి మహిళల పిటిషన్
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇళ్ల నిర్మాణంపై తిరుపతికి చెందిన 7008 మంది నిరుపేద మహిళలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో ఇళ్లు మంజూరైనా కట్టించలేదంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ ను పరిశీలించిన కోర్టు ఈ వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తిరుపతి కార్పొరేషన్ కు నోటీసులు జారీ చేసింది. దీనికి ముందుగా తిరుపతి మహిళలు తమ పిటిషన్ ను సుప్రీంకోర్టులో వేశారు. అయితే అత్యున్నత న్యాయస్థానం సూచన మేరకు హైకోర్టును ఆశ్రయించారు.