: అవినీతికి వ్యతిరేకంగా ఏపీ, తెలంగాణ సచివాలయ ఉద్యోగుల ప్రతిజ్ఞ


అవినీతికి వ్యతిరేకంగా తెలంగాణ సచివాలయ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పనిచేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. శాఖల ప్రతిష్ఠ పెంచేలా పనిచేస్తామని కూడా ఉద్యోగులచే చెప్పించారు. అటు ఏపీ సచివాలయ ఉద్యోగుల చేత కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి.ఠక్కర్ అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా ఇరు సచివాలయ ఉద్యోగులతో ఇలా ప్రతిజ్ఞ చేయించారు.

  • Loading...

More Telugu News