: 16 ఏళ్ల నాటి 'బాంబు పేలుడు' కేసును కొట్టేసిన నాంపల్లి కోర్టు
16 ఏళ్లుగా విచారిస్తున్న ఓ కేసును నాంపల్లి కోర్టు ఈ రోజు కొట్టి వేసింది. 1999లో హైదరాబాదులోని లాల్ దర్వాజా ప్రాంతంలోని కాకతీయ హోటల్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ కేసును ఇన్నేళ్ల పాటు విచారించిన కోర్టు... సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కొట్టివేసింది. దీంతోపాటు, 2000లో చోటు చేసుకున్న మత ఘర్షణలు, అల్లర్ల కేసును కూడా కోర్టు కొట్టివేసింది. ఏళ్లు గడుస్తున్నా సరైన సాక్ష్యాధారాలు లభించకపోవడంతో... ఇకపై ఈ కేసులను కొనసాగించడం అనవసరం అని కోర్టు అభిప్రాయపడింది.