: అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాలపై మధ్యాహ్నంలోగా నివేదిక అందించండి: హైకోర్టు ఆదేశం
అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆస్తుల అమ్మకాలపై మధ్యాహ్నంలోగా నివేదిక అందించాలని ఆదేశించింది. అంతేగాక, ఆస్తుల అమ్మకంపై కమిటీ త్వరలో సమావేశమై విధివిధానాలు ఖరారు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. దానిపై ఈ నెల 30వ తేదీలోగా నివేదిక అందజేయాలని కమిటీ సభ్యులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ మధ్యాహ్నానికి వాయిదా వేసింది.