: ఎప్పుడూ అనుష్కనేనా?... కోహ్లీని విమర్శించరా?
దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా దారుణంగా ఓడిపోవడం... కీలక బ్యాట్స్ మెన్ కోహ్లీ పేలవ ప్రదర్శన నేపథ్యంలో, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. అనుష్క చూట్టూ కోహ్లీ చక్కర్లు కొడుతుండటం వల్లే, అతని ఆటతీరు దిగజారిందని విమర్శకులు తమ నోటికి పని కల్పించారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ను నిషేధించడం కాదు... అనుష్క శర్మను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే, ఈసారి అనూహ్యంగా అనుష్కకు నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది. కోహ్లీ విఫలమయినప్పుడల్లా అనుష్కను నిందించడం సరికాదని వారు అంటున్నారు. అనుష్క సినిమా ఫ్లాప్ అయినప్పుడు కోహ్లీని ఎందుకు తప్పుబట్టడం లేదని ప్రశ్నించారు. ఇతర క్రికెటర్లకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని... వారు విఫలమయినప్పుడు వారి గర్ల్ ఫ్రెండ్స్ ను ఎందుకు నిందించడం లేదని నిలదీస్తున్నారు. ప్రతి దానికీ అనుష్కను నిందించడం సరికాదని సూచిస్తున్నారు.