: బీజేపీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే... పదవులు ఊడినా పోరాటమే!: సోము వీర్రాజు హెచ్చరిక


బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీలో తమ మిత్రపక్షం, అధికార పార్టీ టీడీపీపై మాటల తూటాలను పేలుస్తూనే ఉన్నారు. నేటి ఉదయం ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తోందని ఆయన ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ఇప్పటిదాకా రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన నిధుల వివరాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉందని ఆయన చెప్పారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా అవగాహనా రాహిత్యంతో ఎవరైనా అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఎవరు వ్యాఖ్యానించినా వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో తమ పదవులు ఊడినా పట్టించుకోబోమని ఆయన తెగేసి చెప్పారు.

  • Loading...

More Telugu News