: ఉద్ధండరాయునిపాలెంలో 'మన మట్టి'కి షెడ్డు ఏర్పాటు


నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా మన మట్టి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన మట్టిని ఉద్ధండరాయునిపాలెంలో ఉంచిన విషయం తెలిసిందే. ఒక రాశిగా పోసిన ఆ మట్టికి ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటు చేశారు. ఒకవేళ వర్షం పడినా మట్టి కరిగిపోకుండా ఉండేందుకు ఇలా చేశారు. అంతేగాకుండా శంకుస్థాపన ప్రాంతం వద్ద ఉన్న యాగశాల, శంకుస్థాపన శిలాఫలకం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు అమరావతి గత వైభవాన్ని ప్రధానికి చూపేందుకు ఏర్పాటు చేసిన అమరావతి గ్యాలరీని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఇక శంకుస్థాపన ముగిసిన తరువాత కూడా సభా ప్రాంగణానికి పోలీసు భద్రత కొనసాగుతూనే ఉంది.

  • Loading...

More Telugu News