: 'భారత పుత్రిక' వచ్చేసింది!
భరతమాత ఒడిలో పుట్టి పెరిగి, తెలిసీ తెలియని వయసులో రైలెక్కి, సరిహద్దులు దాటి పాకిస్థాన్ చేరుకుని అక్కడి ఈదీ ఫౌండేషన్ లో ఆశ్రయం పొందిన బాలిక గీత తిరిగి స్వదేశానికి చేరుకుంది. 8 ఏళ్ల వయసులో పాక్ చేరుకున్న గీతకు ఇప్పుడు 23 సంవత్సరాలు. పాక్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చిన గీత, ఆమెతో పాటు వచ్చిన ఈదీ ఫౌండేషన్ నిర్వాహకులు, గీత స్నేహితురాళ్లకు భారత విదేశాంగ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. రెడ్ అండ్ వైట్ సల్వార్ కమీజ్ ధరించి, తలపై దుప్పట్టా కప్పుకుని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ విమానంలో వచ్చిన ఆమెను చూసిన తండ్రి జనార్దన్ మహతో ఆమెను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు.