: విజయవాడ రైల్వే స్టేషన్ లో 20 కిలోల బంగారం పట్టివేత


ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ రైల్వేస్టేషన్ లో 20 కిలోల బంగారం పట్టుబడింది. మూల్ చంద్, నిర్మల్ అనే వ్యాపారులు ఈ బంగారాన్ని హైదరాబాద్ నుంచి చెన్నైకు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి వారి వద్ద ఎలాంటి బిల్లులు లేకపోవడంతో వ్యాపారులను కూడా అరెస్టు చేశారు. అయితే తాము బంగారాన్ని అక్రమంగా తరలించడం లేదని, దాని బిల్లులు హైదరాబాద్ లో ఉన్నాయని వ్యాపారులు పోలీసులకు చెప్పారు. వాటిని తెమ్మని పోలీసులు కోరడంతో వెంటనే వ్యాపారులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News