: గెలిచాక సహకరిస్తానంటూ లంచం బొక్కిన నేత... వీడియో చూడండి!
బీహార్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో బీజేపీ జనరల్ సెక్రటరీ భూపేందర్ యాదవ్ విడుదల చేసిన ఓ వీడియో అధికార జనతాదళ్ (యు)ను మరిన్ని చిక్కుల్లోకి నెట్టింది. జహానాబాద్ జిల్లా ఖుర్దా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్న కుష్వంత్ సాహా, ఓ వ్యాపారి నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కారు. తాను గెలిచిన తరువాత వ్యాపారానికి సహకరిస్తానని, తనకు ఎన్నికల ఖర్చు కింద రూ. 5 లక్షలు ఇవ్వాలని కుష్వంత్ కోరగా, తొలుత రూ. 2 లక్షలు తీసుకోవాలని ఆ వ్యాపారి అంటున్న మాటలు వీడియోలో వినిపిస్తున్నాయి. ఆ వీడియోను మీరూ చూడండి!