: కడప రిమ్స్ లో మెడికో సూసైడ్ అటెంప్ట్... రక్షించిన తోటి విద్యార్థులు
కడపలోని రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో నేటి ఉదయం కలకలం రేగింది. కళాశాలలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న సాయిరాం అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కళాశాల ప్రాంగణంలోని హాస్టల్ లో ఉంటున్న సాయిరాం అనే విద్యార్థి తన గదిలోనే ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. అయితే సకాలంలో గుర్తించిన తోటి విద్యార్థులు అతడు బిగించుకున్న ఉరిని విప్పారు. సూసైడ్ అటెంప్ట్ లో తీవ్రంగా గాయపడ్డ అతడిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. సాయిరాం ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన కారణాలు తెలియాల్సి ఉంది.