: చివరి ఘడియ దాకా ఉత్కంఠే!... వరంగల్ అభ్యర్థి ఖరారుపై టీఆర్ఎస్ మల్లగుల్లాలు


వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి చివరి ఘడియ దాకా ఉత్కంఠ పరిస్థితి తప్పేలా లేదు. తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ స్థానాన్ని తప్పక నిలబెట్టుకోవలసిన పరిస్థితిలో, సరైన అభ్యర్థి ఎంపిక కోసం టీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతోంది. ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన ఈ స్థానం నుంచి పెద్దపల్లి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కె.వివేక్ ను బరిలోకి దింపాలని ఆ పార్టీ చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించకపోతే, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి అక్కడ గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ ఎన్నికను టీఆర్ఎస్ పాలనకు రెఫరెండంగా ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు అధికార పార్టీని ఇరుకున పెట్టేశాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాతే తన అభ్యర్థిని ప్రకటించాలని కూడా టీఆర్ఎస్ యోచిస్తోంది. ఈ క్రమంలో నామినేషన్ల గడువు ముగిసేదాకా ఉత్కంఠ పరిస్థితులు తప్పేలా లేవు. ఇప్పటికే పలువురు ఎస్సీ సామాజిక వర్గ నేతలు టీకెట్ కోసం విశ్వ యత్నం చేస్తున్నా, పార్టీ మాత్రం ఒకటికి పది సార్లు ఆయా నేతల అభ్యర్థనలను పరిశీలిస్తోంది.

  • Loading...

More Telugu News