: వెంకన్న సేవలో తమిళ గవర్నర్ రోశయ్య... ఏపీ మంత్రి సిద్ధా కూడా!


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు గవర్నర్ రోశయ్య నేటి ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. నిన్న రాత్రే తిరుమల చేరుకున్న రోశయ్య నేటి తెల్లవారుజామున సుప్రభాత సేవలో వేంకటేశ్వర స్వామిని దర్శించున్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సేవలను కొనియాడారు. భక్తులకు వెంకన్న దర్శనం కల్పించడంలో టీటీడీ అధికారులు చేపడుతున్న చర్యలు బాగున్నాయని ఆయన అన్నారు. మరోవైపు ఏపీ రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు కూడా నేటి ఉదయం వెంకన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News