: చంద్రబాబు ఆరాతో పోలీసుల్లో కదలిక...‘కృపామణి’ నిందితుల కోసం ముమ్మర గాలింపు


పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో తల్లిదండ్రులు, సోదరుడు, మరో రౌడీ షీటర్ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న గృహిణి కృపామణి ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు ముందు కృపామణి రికార్డు చేసిన సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నాలుగు రోజులు గడుస్తున్నా ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ కేసు విషయంపై దృష్టి సారించారు. కేసు పూర్వపరాలు తెలుసుకున్న చంద్రబాబు, కృపామణి ఆత్మహత్యకు కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అడిషనల్ డీజీ ఆర్పీ ఠాకూర్ నిన్న వేల్పూరును సందర్శించారు. కృపామణి భర్తతో మాట్లాడిన ఠాకూర్, కేసుపై పోలీసులతోనూ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన తణుకులో మీడియాతో మాట్లాడుతూ 15 రోజుల్లోగా చార్జీషీటు దాఖలు చేస్తామని తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News